Christmas lyrics

కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడిఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడికీర్తనలు 100: 4

ప్రియమైన సహోదరి సహోదరులకు Songs of Jesus Ministry తరుపున ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు . మాకు అండగా వుంటున్న His Kingdom Ministries, Founder & Presedent  Bro. రవికాంత్ అన్న గారికి మా ప్రత్యేక వందనములు. ఈ PDF చేయడంలో సహాయం చేసిన సహోదరి మరియు సహోదరులందరికి ప్రత్యేక వందనములు. దేవుడు మాకిచ్చిన తలంపును బట్టి 2016 వ సంవత్సరం  పాటలతో చేసిన100 PDF ని ఆదరించి ఎందరో పాటల ద్వారా దేవుని మహిమ పరిచారు. వ సంవత్సరం2017 క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేకంగా 270 పాటల లిరిక్స్ తో ఈ PDF చేయాలనే ఆలోచన కల్గించినందుకు దేవుడికి కృతజ్ఞతలు దేవునికి మహిమా కలుగును గాక.
ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అయినా  క్రిస్మస్ మరియు కొత్త సంవత్సర సందర్బములో ప్రతి సంఘానికి మరియు విశ్వాసులుకు పాటలు పాడడానికి సులువుగా ఉండాలనే ఉద్దేశంతో  క్రిస్మస్ పాటలు మరియు కొత్త సంవత్సర పాటల లిరిక్స్ టైప్ చేసి PDF గా రూపొందించడం జరిగింది  దినిని మీ స్నేహితులందరికి మరియు అన్నీ సంఘాల వారికి షేర్ చేయండి . ఈ విధంగా చేయడానికి దేవుడు మాకిచ్చిన ప్రేరణను బట్టి ఎంత గానో సంతోషిస్తున్నాము. ఈ PDF లో ఉన్న పాటల ద్వారా ప్రతి సంఘంలోని విశ్వాసులు పాటలు నేర్చుకోవాలని ఆత్మీయంగా బలపడాలని మా కోరిక . సమస్త మహిమా ఘనత దేవునికి చెల్లును గాక. ఇతర వివరములకు మా వాట్సప్ నెంబర్ లో సంప్రదిచండి.

మేము ప్రతి తెలుగు క్రైస్తవుల కోసం ఒక ఆప్ డెవలప్ చేసాము. ఇందులో 2200 కు పైగా తెలుగు పాటలు , కొన్ని ఇంగ్లీష్ , హింది మరియు తెలుగు పాటలు ఇంగ్లిష్ లో ఉంటాయి ఇంకా తెలుగు పరిశుద్ద గ్రంధము కూడా ఇందులో ఉంటుంది. ఈ ఆప్ ని Play Store నుండి Download చేసుకోవచ్చు. Songs of Jesus Ministiry అని Play Store  లో  టైప్ చేస్తే                ఈ లోగో తో ఉన్న ఆప్ ని Download చేసుకోండీ. ఈ ఆప్ ప్రతి క్రైస్తవునికి ఉపయోగంగా ఉండాలనేది మా ఉద్దేశం. ప్రత్యేకంగా Songs Of Jesus Ministry కోసం ప్రార్ధన చేయగలరని మనవి.
మీరు మా Songs Of Jesus Ministry వాట్సప్ గ్రూప్ లో మెంబర్ గా ఉండాలి అనుకుంటే మా వాట్సప్ నెంబర్ (9133519606) కి మీ పేరు మరియు గ్రామము మెసేజ్ చేయగలరు లేదా ఇండెక్స్ తర్వాత ఇవ్వబడిన లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు .

NOTE: మీరు సొంతంగా రాసిన పాటలు ఈ PDF లో ఉండకూడదు అనుకుంటే దయచేసి మా నెంబర్ లో తెలుపగలరు వెంటనే వాటిని తీసేస్తాము.
ధన్యవాదములు
Songs of Jesus Ministry
Bharath   


CHRISTAMAS SONGS INDEX

246    Jingle Bells
247    Joy to The world

NEW YEAR SONGS INDEX





-------------------------------Songs of Jesus Ministry-------------------------------


Email                 SongsofJesusMinistry@gmail.com
Download the Application from below link :
https://play.google.com/store/apps/details?id=com.christianappdevelopers.soj




CHRISTAMAS  SONGS
పాట – 1
అందాల తారొకటి ఉదయుంచింది
ఆకాశానికి కొత్త కళ తెచ్చింది యేసయ్య  
జన్మను ప్రకటించింది జ్ఞానులను దారిలో నడిపించింది
అ.ప: wish you happy christmas       
we wish you merry Christmas
1.     పొలములో ఉన్న కాపరులకుదేవుని ప్రేమ కనిపించింది   
దావీదు పట్టణములో పుట్టిన
రక్షకుని ఆనవాలు తెలియజేసింది
2.    పరలోక సైన్యసమూహములు భూలోకమునకు
దిగివచ్చాయు సర్వోన్నత స్థలములలో మహిమని  
దేవునికి స్తోత్రములు చెల్లించాయు
3.    దేవుని ఎరుగని అన్యులకు తారవలె దారిచూపించాలి  
సువర్తమానము ప్రకటించుచు క్రీస్తునకు మహిమను కలిగించాలి
పాట – 2
అందాల దేశము సుందరమైనది
పరలోక  పట్టణమమ్మా ప్రభు నికిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....
1.     బంగారు వీధులు ఇస్తున్నాడమ్మ
శ్రుంగారంగాను నిను నడిపిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....
2.    సూర్యుడు చంద్రుడు ఉండరమ్మా
యెసయ్యే వెలుగై ఉంటాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....
3.    చిన్న పిల్లలందరిని రమ్మన్నాడమ్మా
ఆదరించి ముద్దాడి దివిస్తాడమ్మా
జో...... జో...... జో...... లాలి.... జో...... జో...... జో.....  
పాట – 3
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని               ||అందాల తార||
1.     విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్         ||అందాల తార||
2.    యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి          
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు |అందాలతార|
3.    ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. ||అందాల తార|| 
పాట - 4
అంబర వీధిలో – సంబరం గాంచిరి
కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి//2//
1. బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో
పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను//2//
2. తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి
తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి//2//
3. ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము
మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము//2//    
పాట – 5
అంబరవీధిలో తారక - వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక - లోకానికి ప్రకటించగా
1.     జ్ఞానులు తారను గమనించి - బెత్లెహేమునకు పయనించి
శిశువును గని సంతోషించి - మ్రొక్కిరి కానుకలర్పించి
2.    అంధకారమును తొలగించి - హృదయపు దీపము వెలిగించి
వాక్యమే ఇల నిజతారకలా –నడుపును మార్గము బొదించి
3.    జగతికి యేసుని చూపించి – జనులకు రక్షణ చాటించి
ప్రతి క్రైస్తవుడు ఒక తారకలా – నిలవాలి వెలుగును పంచి

పాట – 6
అంబరవీధిలో వింతైన తారక /2/
సందడిచేసిందటశుభవార్త తెచ్చిందట !/2/
అంబరవీధిలో వింతైన తారక 
Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/
1.దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగా
కారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా /2/
సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగ 
సర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా /2/
Chorus: Wish you we wish you, we wish you happy Christmas /4/
2.దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగా
గొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా /2/
జ్ఞానులంతా ప్రణమిల్లి కానుకలే అర్పించగా 
క్రీస్తుయేసుని జననంతో  భువియే పులకరించగా /2/

పాట – 7
అంబరాన నడిచేను నక్షత్రం ఆనందబరితులు చేసెను
స్తోత్రం , సంబరాలు చేయగ ప్రతి గోత్రం
యేసు రాజుకే స్తుతి స్తోత్రం                  “సర్వ జనులకు
1.     మనవాళిని రక్షింపను , పాప చీకటి తొలగింపను
వ్యాది భాదలు తొలగింపను,నీతి సూర్యుడు జనియించేను “Happy” “అంబరాన
2.    పేదరికము తొలగింపను , శపమంత తొలగింపను
చింతలన్ని తొలగింపను , శ్రీమంతుడేసు జనియించేను              “Happy” “అంబరాన
3.    శత్రు భయము తొలగింపను మరణ భయము తొలగింపను
కన్నిరంత తొలగింపను ఇమ్మనుయెలు జనియించెను               “Happy” “అంబరాన
పాట – 8
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల
యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని
1.     ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి (2)
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2)
2.    దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే మార్గము చూపించే (2)
3.    సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే జనులను ప్రేమించే (2) 
పాట – 9
అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
సీకటంత పారిపాయెరా  //2//
మా సిక్కులన్ని తీరిపాయెరా 
మా దిక్కుమొక్కు యేసుడాయెరా  //2//
సంబరాలు ఈయాల సంబరాలు
క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3//
1.     గొల్లలంతరాతిరేల కంటిమీద కునుకు లేక
మందలను కాయుచుండగా – చలి మంటలను కాయుచుండగా //2//
 మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే –                    
 ఎలుగులోన దేవ దూత కనిపించే //2// 
ఎమ౦టడేమోనని గుండె ధడ పుట్టే…..
ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన// 
2.    సల్లగాలివీసీంది సుక్కా దారి సూపింది
జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2//
బంగారు బోల కానుకలు తెచ్చారు
వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//
 దూతలంతా గానాలు చేశారు…..
లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా //2//అకసాన/
పాట – 10
అడియందు వాక్యముండేను  వాక్యమ దేవుని యెద్ద ఉండేను (2)
ఆ....  వాక్యమే శరీర దారియై కృపాసత్య సంపూర్ణుడయేను (2)
Happy happy Christmas to you
Merry merry Christmas to you (2)
1.       ఆయనలో జీవముండేను ఆ జీవమే మనకు వెలుగు (2)
ఆ వెలుగు నిజమైన వెలుగు అందరినీ వెలిగించుచున్నది (2)
Happy happy Christmas to you
Merry merry Christmas to you (2)
2.      యేసు క్రీస్త నామమున విశ్వసముంచు వారికి (2)
దేవుని పిల్లలగుటకు అదికారం ఆనుగ్రహించేను (2)
Happy happy Christmas to you
Merry merry Christmas to you (2)

పాట – 11
అత్యంత రమణీయ అమరపురము వీడి
అవనికి అరుదించితివా దేవా (2)
అల్పులైన్న మాపై నీ ప్రేమ నిలుపా (2)
సంకల్పించితివా తండ్రి బ్రోవా (2) (అత్యంత)
1.     ఆదాము పాపము హరియింపగా
నిర్మల గర్భము సృజియితివా
రక్షణ కాలము అరుదించగా
కన్యకు శిశువుగా జన్మించితివా
భక్తుల మోకులు నేరవేర్చగా
బేత్లహేములో ఉదయించినవ (2)
ఘనత మహిమ  స్తుతులుఅనుచు
దూతగానములు కీర్తనలు  పాడగా (2)
అత్యంత రమణీయ)
2.    చీకటిలో చిరుద్వీపం విలిగించగా
వేదనలో ఉపశమనం కలిగించగా
సాతాను దాస్యము తొలగించగా
శాంతి సందేశము వినిపించగా
ధరపైన ప్రభురాజ్యం స్థాపించనించి
నరరూపదరుడవై  జేనియించినవా(2)
 రాజులరరాజు ప్రభవించినడాఅనుచు

గొల్లలు జ్ఞానులు దర్శించరగా(అత్యంత రమణీయ)
పాట – 12
అదిగదిగో అందాల తారా  రక్షకుడై పుట్టాడని
చీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని  ”2”
ఒక వార్త తెలిసెను మనకు , శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా          “2”
1.     బందకాలను  తెంచివేయును యేసుడే ఉన్నాడని
అనాదైనా , అబాగ్యులైనా నేనున్నానని  “2”      “ఒక వార్త
2.    అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని  “2”“ఒక వార్త

పాట– 13
అదిగాదిగో తోక చుక్క  అల్లదిగో బేత్లేలేహేము
అదిగాదిగో తోక చుక్క  అల్లదిగో పశువుల పాక(2)
రాజులకు రాజు పుట్టె వోరైయలరా
రండి రండి చుసేదము ఓ అమ్మలారా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
వచ్చేసాడు మేసయ్యా
మారియాకుమారుడు యేసయ్యా
వచ్చేసాడు మేసయ్యా
దైవా కుమారుడు యేసయ్యా
వచ్చేసాడు మేసయ్యా
1.     దూతలు చేపిన మాటలు నిజమయేరే
దైవాతనయుడు ఇల్లలో పుట్టడురా(2)
దండలు పెట్టుకొని దండిగా దీవించుమని
మన అండగా ఉండమని మనం వేడుకుందామా (అదిగాదిగో తోక చుక్క)
2.    వస్తానన్నా మేసైయ్య వచ్చినడురా
వస్తు వస్తు సుఖశాంతులు తేచినడురా
జై రాజా జై అంటూ జై కొడదామా
జోలపడి లాలిపడి జోకోడుదమా(అదిగాదిగో తోక చుక్క
పాట – 14
అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము
బేత్లెహేము ఊరిలోన యోసేపను మనుజుని యింట మరియకన్నియ ఉంది
దైవబలము కలిగిన యువతీ
ఆ కన్య గర్బములోన ఓ బాలుడు ఉదయించాడు
ఆ బాలుడు యేసైయంట వోరైయ్యా దేవా దూత సేలవిచెను వినవాయ్యా
1)    తుర్పు ఎంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతుంది చూడు(2)
చీకటింకమాయం పాపమంత దూరం (2)
చిన్ని యేసు జగతికింక నేస్తం (అనగనగ)
2)   శాంతి లేదు సుఖము లేదు మనసు చీకటయే బ్రతుకు భారమాయే(2)
శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం (2)
రక్షకుండు నేడు పుట్టినాడు(అనగనగ)

పాట – 15
అరుణకాంతి కిరణమై-కరుణ చూపి ధరణిపై
నరుని రూపు దాల్చెను-పరమదేవ తనయుడు
అదే అదే క్రిస్మస్ - హ్యాపీ క్రిస్మస్ (2) ఇదే ఇదే క్రిస్మస్ - మెరీ క్రిస్మస్
1.     యజ్ఞ యాగాదులు-బలికర్మ కాండలు
దోషంబులు కడుగలేవు-దోషుల రక్షింపలేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే-పాపులకిల ముక్తి కలుగును
అందుకే అందుకే ..అరుణ
2.    పుణ్యకార్యంబులు - మరి తీర్థయాత్రలు
మోక్షంబును చేర్చలేవు-మనశ్శాంతిని కూర్చలేవు
పరిశుద్ధుని రక్తమునందే-పాపులకిల ముక్తి కలుగును
అందుకే అందుకే ..అరుణ 
పాట –16
అలరారు ఆ దివ్యరూపం - పశుశాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవ పాపం
ప్రభవించెను ఇలలో ఆనందాం
1.     ప్రకృతియే పరవశించి ఆడె - పరలోక సైన్యాలు పాడె
భక్తితో ఆ బాలుని వేడ - చూపించె ఒక తార జాడ
2.    జగతిలోన మానవులను చూచె - బాలయేసు రూపము దాల్చె
గొల్లలే సేవింప రాగా - ప్రణమిల్లు ఈ దినమే వేగ 
పాట – 17
ఆఆఆ... పాటలు పాడుదము
ఆఆఆ... నాట్యము చేయుదము (2)
ప్రజలందరికి ప్రభువుద్భవించెను పండుగ చేయుదము (2) ..ఆఆఆ..
1.     కాలము సంపూర్ణమాయెను - లేఖనములు నెరవేరెను (2)
కన్య మరియ గర్భమున - క్రీస్తు యేసు జన్మించెను (2) ..ఆఆఆ..
2.    సర్వోన్నతుని కుమారుడు - సమాధానమున కధిపతియు (2)
సర్వజనుల రక్షకుడు సతతం స్తోత్రార్హుడు (2) ...ఆఆఆఆ...

పాట – 18
ఆకశాన తార ఒకటి వెలసింది - ఉదయించెను రక్షకుడని తెలిపింది
ఇదే Christmas - Happy, happy Christmas
Merry, MerryChristmas
1.     యూద దేశపు బెత్లెహేములో - కన్య మరియ గర్బమున జన్మించె
తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు - యూదుల రాజు ఎక్కడని వెతికారు తూరుపు దిక్కున చుక్కను కనుగొని - ఆనందభరితులై
యేసుని చేరిరి కానుకలిచ్చిరి పూజించిరి -
ఇదే Christmas - Happy, happy Christmas Merry, Merry Christmas
Happy,Happy Christmas "ఆకశాన"
2.    రాత్రివేళలో మంద కాసెడి - కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
లోక ప్రజలకు మిగుల సంతసం - కలిగించెడి వర్తమానమందించే
క్రీస్తే శిశువుగా యేసుని పేరట - ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
సంతోషగానముతో స్తుతియింతుము
ఇదే Christmas - Happy, happy Christmas Merry, Merry Christmas
Happy, happy Christmas "ఆకశాన"

పాట – 19
ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఈ లోకం ఆనందమయమై మురిసింది (2)
అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా (2)
రక్షణకై నిరీక్షణతో (2)
వీక్షించే ఈ అవనిలో (2)
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ           ||ఆకాశం||
పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా (2)
సమ్మతిని మమతలను (2)
పెంచుటకై ఈ పృథివిపై (2)
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ             ||ఆకాశం||
పాట – 20
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
పరలోకం విరిసింది గాన ప్రతిగానం (2)
సర్వోన్నతమైన స్థలములలో
ఘన దేవునికే మహిమా
ఆయన కిష్టులైన మనుజులకు
భూమ్మీద సమాధానము
కలుగునుగాక కలుగునుగాక హల్లెలూయాని (2)
1)    పరలోక నాధుండు - లోకాన్ని ప్రేమించి
పరసుతుడై పుట్టాడు - మరియమ్మ గర్భామందున
ధరపాపి రక్షింపన్ నరరూప దాల్చాడు(2)(ఆకాశం)
2)   పొలమందు కాపరులు రాత్రివేళయందు
చలియందు తమ మందను కాపుకాయుచు నుండగ
ఎరిగించె శుభవార్త దూత గొల్లలకు (2)(ఆకాశం)
3)   చూచారు ఘగనానా - ఒక తార జ్ఞానులు
చేరారు ఆ తార వెంట
బెత్లెహేము గ్రామమున్ (2)
గాచారు ప్రభురాజున్ మ్రొక్కికాంతులతో (2) (ఆకాశం)

పాట – 21
  ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది
        
వింత వింత కాంతులు పంచిపెట్టింది
1. 
ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది
   
లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది
2. 
జ్ఞానులకు సరియైన దారి చూపింది
   
బాలుడైన యేసురాజు చెంత చేర్చింది
పాట – 22
ఆకాశంలో చూడు ఒక వింత తారక
వెలుగులు చిమ్మెను క్రీస్తు జన్మచాటగా             “2
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
ఆయన కిష్టులైన వారందరికి భూవిపైన సమాదానము
Happy happy happy Christmas - merry merry merry Christmas    “2” 
1.     పరిశుద్ద ఆత్మవలన కన్య మరియ గర్బమందున
లోక పాపాలు మోయు దేవుని గొర్రెపిల్లగా
జన్మించెను ధర పులకించగా – సర్వలోకము పరవశించగా                   “2”
2.    గాబ్రియేలు ధూత తెల్పెను యేసు వార్త గొల్లలకు
తార తెలిపే మార్గమున తూర్పు దేశ జ్ఞానులకు
బంగారు సాంబ్రాణి  బొళమును కానుక లర్పించిరి
పండితులు పామరులు ఎవ్వరికైనా యెసే నిజమైన దేవుడు         “2
 పాట– 23
ఆకాశాన వెలసింది తార
ఆ తారకర్థం శ్రీ యేసు జననం (2)
ఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2)
1.     దివిలోన దూతల్ స్తుతి గీతి పాడెన్
నీ దివ్య నామంబు మహిమా (2)
మేమంత పాడి నిను కీర్తింతుము (2)
నీ ప్రేమ సందేశమివ్వా
అ.ప.: ఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2) ..ఆకాశా
2.    అపరంజి బోళం సాంబ్రాణులన్ని
కానుకలిచ్చారు జ్ఞానుల్ (2)
నవకాంతులన్నీ లోకాన వెలిగే (2)
పాపాలు పరిహారమాయే
ఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2)
పాట – 24
ఆనందం ఆనందం బెత్లహేమూ పురములో ఆనందం
సంతోషం సంతోషం మన అందరిమనసులో సంతోషం 2
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయ    2
1.     గొర్రెల కాపరులభయము తొలిగింది యేసుని జన్మతో లోకం వెలిగింది 2
యేసు పుట్టెను భయము తొలగెను జనులందరికి రక్షణ కలిగెన్ 2
2.    పాప బంధకాలలోవున్నా నిన్ను విడిపించుటకు యెసయ్యా జన్మించే
నేడే వేడుకో ఆ ప్రభు యేసుని రక్షణ నీకు కావాలని      “2
పాట – 25
ఆనందమానందమే
ఈ భువిలో యేసయ్య నీ జననము (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమ ప్రభావము
భూమి మీద తనకిష్టులకు
సమాధానము కలుగును గాక
హల్లెలూయా           ||ఆనంద||
తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట
కొరకై యేసు భువికి దిగి వచ్చెను
తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు
దేవుని జ్ఞానమై వచ్చెను          ||సర్వోన్నత||
మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి
యేసు అరుణోదయమిచ్చెను
పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు
క్రీస్తు నర రూపము దాల్చెను       ||సర్వోన్నత|| 
పాట – 26
ఆరాధన - ఆరాధన క్రిస్మస్ ఆరాధన (2)
యేసయ్యా జన్మదిన క్రిస్మస్ ఆరాధన (2)
అప:- ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే (2)
1)    కనిపించకుండా లేవు మాటలతో చెప్పలేవు
హృదయ శుద్ధిగలవారే ప్రభుని చూచెదరండి
వర్ణింపతరమా వివరింపతరమా ఈ మహ ఆనందము (2)( ఉల్లా)
2)   ఆచారపండగ కాదు వారసత్వ పండుగ కాదు
పుట్టుకతో మేము క్రైస్తవులం అన్న భావన ఉండరాదు
మారుమనస్సు పొందితేనే దొరెకెను ఈ తరం (2)(ఉల్లా)
3)   దేశమేదైన గాని యేసే నిత్యజీవమని
భావన ప్రజలందరు భక్తి ఆశక్తిగలిగి
కారణ జన్ముడు ఘనుడు యేసుకు స్తోత్రం చెల్లించెదం ( ఉల్లా)
పాట – 27
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా ఓ ... .. నిత్యుడగు తండ్రి సమాదాన ఆదిపతి మనకై జన్మించెను…      “2”
We wish you happy Christmas very very Christmas హోసన్న హల్లెలుయా క్రిస్టమస్ బాలునికె “2”
Angels we have heard on high sweetly singing all the place and the mountains in reply ecoling there  joy his range
ధరపై ఎన్నోఆశ్చర్య కార్యములు చేయుటకు దరిద్రులన చేరి ధనవంతులుగా చేయుటకు “2”
దొంగలను బాచేయి దయచూపినావూ “2”
ధవళ వస్రములు దరింపచేసి ధన్యుని చేసావు
We wish you happy Christmas very very Christmas హోసన్న హల్లెలుయా క్రిస్టమస్ బాలునికె 2”
నిత్యుడగు తండ్రిగా  నిరీక్షణను ఇచ్చుటకు నీతి న్యాయములు నేర్పి నన్ను నీవు నడిపించుటకు    “2”
ని నిత్య మార్గములో శాంతి నిచ్చావు “2”
నితో నిరతము జీవించుటకు నిత్యజివము ఇయ్య అరుదించినావు
We wish you happy Christmas very very Christmas హోసన్న హల్లెలుయా క్రిస్టమస్ బాలునికె “2”
పాట – 28
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||
1.     యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||
2.    మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)    ||ఆనందమే||
3.    తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)        ||ఆనందమే||
పాట – 29
ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం -
హల్లేలూయ .. ఆహా ..
1.     కన్యక గర్భమందు పుట్టగా – ధన్యుడవంచు దూతలందరు (2)
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో (2)
నిన్నారాధించిరి - హల్లేలూయ .. ఆహా ..
2.    యెహోవా తనయా - యేసు ప్రభూ సహాయుడా – మా స్నేహితుడా (2)
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ -
మహానందముతో నిన్నారాధింతుము(2)
నిన్నారాధింతుము - హల్లేలూయ .. ఆహా ..
3.    సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2)
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రించు వేళలో (2)
నిన్నారాధింతుము - హల్లేలూయ .. ఆహా ..
పాట – 30
ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి – చేయాలి సందడి ఊరంతా సందడి
మనసంతా సందడి మనకెంతో సందడి – జరగాలి సందడి మన క్రీస్మస్ సందడి
ఆనందమే ఎంతో ఆనందమే యేసు నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు నా కొరకే వచ్చే ఈ రోజా  “2”  “ఇంటి
లోక పాపము భరియించను దైవ పుత్రుడు దిగివచ్చెను
నీతి సూర్యుడు ఉదయించేను లోకమంతా వెలుగోచ్చెను “2”  “ఆనందమే
దేవదూతలే దిగివచ్చెను దేవదేవుని స్తుతీయించును
గొల్లలంతా వచ్చను యేసురాజును పూజించేను “2”  “ఆనందమే

పాట – 31
ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని
వింత సంగతి యేసు పుట్టుక
బెత్లెహేము అయ్యింది వేదిక
తూర్పునుండి వచ్చింది తారక
అ.ప. : ఎంత గొప్ప కానుక - చింతలింక లేవిక
అంతటా అందుకే పండుగ
1.     పాపియైన మనిషిలో నుండి
నీతిరాజు ఎట్లు వచ్చునండి
పావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొని
కన్యమరియ జన్మనిచ్చెనండి
2.    అల్పమైన నజరేతునుండి
మంచి ఫలము ఎట్లు వచ్చునండి
చెడ్డదాన్ని ఎన్నుకొని గొప్పచేయ పూనుకొని
మేలుకరముగా మార్చెనండి
3.    నరునికై మహిమలో నుండి
మధ్యవర్తి ఎట్లు వచ్చునండి
రక్షకుని వేడుకొని శిక్షమీద వేసుకొని
ఇద్దరిపై చెయ్యి ఉంచెనండి

పాట– 32
ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం
1.     రాజులనేలే రారాజు  వెలసెను పశువుల పాకలో
పాపులపాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయములేదు మనకిలలోజయము జయము హో
2.    గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడుపూజించిరి ప్రేమ గీతితో
జయనాధమే ఈభువిలొప్రతిధ్వనించేను ఆభువిలో

పాట– 33
ఇదే క్రిస్మస్ పండుగరోజు - నేడే శ్రీయేసుని పుట్టిన రోజు
క్రీస్తు ప్రభు నరరూపిగ - ధరకేతెంచిన రోజు ఈ రోజు
ఆహ ఆనందమే - ఆహ ఆశ్చర్యమే - రక్షకుని జననము
భయమేలనే భువియందున - జయరాజు జన్మంచెను (2) (ఇదే)
1)    సర్వోన్నతుడు సర్వశక్తుడు
సర్వజనములకు రక్షణ దర్శనమిచ్చెను
పరమానందమే (ఇదే)
2)   అన్యజనులకు ఆశ్రయదుర్గము
అంధకారముతో ఆశజ్యోతి (2)
వాత్సల్యముతో వెలుగుగా వచ్చెను
మహదానందమే (ఇదే)
3)   ప్రియ కుమారుడు ఇమ్మానుయేలు
మార్గము సత్యము జీవమాయేసే(2)
అక్షయ మార్గము ఆనందింపవచ్చెను
నిత్యమానందమే (ఇదే)



పాట – 34
ఇమ్మనుయేలు దేవుడా - నను గన్న దేవుడా
ఇస్సాకు దేవుడా - ఇశ్రాయేలు దేవుడా
మాతోనుండగ వచ్చిన మరియ తనయుడా
లాలి లాలి లాలమ్మ లాలి... లాలి లాలి లాలి జో లాలి
1)    మా పాపము బాప  - పరమున మము చేర్చగా
దివిని వీడి భువికి దిగిన దైవ తవయుడా
ఇస్సాకు దేవుడా - ఇశ్రాయేలు దేవుడా
మాతోనుండగ వచ్చిన మరియ తనయుడా
లాలి లాలి లాలమ్మ లాలి... లాలి లాలి లాలి జో లాలి
2)   అశాంతిని తొలగించి - శాంతిని నెలకొల్పెగా
ప్రేమరూపుడై వెలసిన - బాలయేసువా
ఇస్సాకు దేవుడా - ఇశ్రాయేలు దేవుడా
మాతోనుండగ వచ్చిన మరియ తనయుడా
లాలి లాలి లాలమ్మ లాలి... లాలి లాలి లాలి జో లాలి

పాట – 35
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా
1.     … అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)
జన్మించినాడంట వెన్నెలా - ఈ అవనిలోనంట వెన్నెలా (2)ఇళ్లలోన॥
2.    హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
… యూదా దేశమందు వెన్నెల
ఆహా బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)
రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు యేసంట వెన్నెల (2)   ఇళ్లలోన॥
3.    ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల.. ఆహా దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2)   ఇళ్లలోన॥
4.    … దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
పాపులైన మనకోసం వెన్నెల… ఆహా ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)
పరలోకానికి మార్గం వెన్నెలా ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2)   ఇళ్లలోన॥
5.    హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా (2)
యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా
పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)
క్రొత్తగా జన్మించు వెన్నెలా రక్షణను పొందుకో వెన్నెలా (2)       ఇళ్లలోన॥
పాట – 36
ఈ దినం శుభ దినం
ఈ లోకానికే పర్వ దినం
ప్రకృతి పరవసించెను
ప్రతి హృదయము పులకించెను
శుభం శుభం నీకు శుభం
ఈ లోకానికే శుభ దినం

రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను
తన ప్రజల వారి పాపము నుండి
విడిపించి రక్షింపను  

మహిమా స్వరూపుడు
క్రీస్తుగా జన్మించెను
నిత్య జీవమును  శాశ్వత ప్రేమను
సమాధాన మిచ్ఛుటకు                           

శ్రీమంతుడైన దేవుడు
దీనునిగా జన్మించెను
దీనులను ధన్యులను చేసి
ఆశీర్వదించుటకు  
పాట – 37
ఈనాడే శుభదినం-ప్రభుయేసుని మహోదయం
దైవసుతుడే ఇలకు దిగివచ్చెనే
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)
1.     పెరిగే పాపభారం-మనిషి మరిచే మానవత్వం
కలిగే దైవ మార్గం-దారిచూపే యేసు జననం (2)
ఎంతో మధురమయ్యా-మది నిండే ఆ వార్తకు (2)
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)
2.    సంతోషాల సమయం-సర్వలోకం వెలుగునిండ
అజ్ఞానుల తిమిరం-అణగద్రొక్కే రాజు వచ్చే (2)
అంతా కలసి ఆ ప్రభుని సేవింపగా (2)
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)
పాట – 38
ఈరోజు క్రిస్మస్ వచ్చింది ఎన్నోనో తేచిపెట్టింది కన్నీరు తుడిచి
కలుశాలు భాపే బాలుడు జన్మించాడు
భూవి  ప్రజలి దివిలో దుతలి ఈ విశ్వమంతా గొంతేతి  పాడిన
  మహిమ వితిడైన దేవునికి  ఈ స్తుతి సరిపోదు ఎందరో 
కవులు ఎన్నోగీతాలు రచించిన్న మరెందరో గాయకులూ
గాసింనం చేసిన ఆయనను స్తుతిచడానికి  ఈ కాలాలు
ఈ గళాలు సరిపోవు మన జాలికి తను ఆర్పనంగా
చిసుకుని అభాయమిచి ఆదుకుని లోక పాపమును
మోసుకుని పోవు దేవుని గోరీ పిలా దినుడై దివి
నుండి భువి దిగి వచిన్న వేల మనకు క్రిస్మస్ పండుగా
1)    క్రిస్మస్ వచ్చింది ఎన్నెనో తెచింది కన్నిరుకష్టాలు తీర్చింది
ఎంతెంతో సంతోశమియ్యంగా యేసు బాలుడై జన్మించెను ( 2 )
సర్వోనాథం బైనా స్థలములలో మహిమ భూమిపై ఇష్టులకు సమాదానము ( 2 )
2)   పాపల భూమిని పరిశుద్ద పరిచి శుద్ధి కరించగా యేసు ( 2 )
ప్రేమతో ప్రజలను పాలించి పుడమి పై ప్రభవించే ఈ రేయిలో
 క్రిస్మస్ యి పలకించ్చవోయి వికసించి విరిసింది హాయి2
3)   మనుజలికి తాను  అర్పణం చేయ మేస్సయగా తాను దాల్చే (2)
నీసిధిలో నేడు నిరుపామ తేజుడై నింగిని విడేనుగా ( 2 ) 
క్రిస్మస్ వచ్చింది ఎన్నెనో తెచింది కన్నిరు కష్టాలు తీర్చింది
ఎంతెంతో సంతోశమియ్యంగా యేసు బాలుడై జన్మించెను ( 2 )
సర్వోనాథం బైనా స్థలములలో మహిమ
భూమిపై ఇష్టులకు సమాదానము ( 2 )
పాట – 39
ఈలోకంలో గతియించినదాని – వెదకి రక్షించుటకై 
పరలోకంనుండి అరుదెంచె మనకు – రక్షణ నిచ్చుటకై 
యెహోవ దేవా నీకేనయా – రాజుల రాజ స్తోత్రమయా /2/ఈలోకం/
1. మాలో ఒకనిగ పుట్టినవాడ – ఎన్నో క్రియలను చేసినవాడ
నీకే స్తోత్రమయా 
నీ నామమెంతో అద్భుతమ్ అద్భుతమ్ 
నీకార్యమెంతో శాస్వతమ్… 
నీరాజ్యమే నిరంతరమ్ .. … /యెహోవ/   
2. వేవేల కాంతులకన్న – తెజోమయుడవు నీవేనయ్యా 
నీకే స్తోత్రమయా
నీ వాక్యమెంతో మధురమ్ మధురమ్ 
నీమాట ఎంతో  శాస్వతమ్
నీ ప్రేమయే నిరంతరమ్… /యెహోవ/
పాట – 40
ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయు
మరియ నందనుఁడై యిమ్మానులేల్ = సదయుఁడై చెడియున్న పృధివికి
నొదవ సమ్మద మల పిశాచికి – మద మణంగన సాధు జనముల
హృదయముల ముద మెదుగునట్లుగ llనుదయించిll
1.     ఏ విభునివలన – నీ జగ మయ్యె – నా విభుఁ డీయిలను = దైవత్వమగు
మను – ష్యావతారముఁ దాల్చె = జీవులకు జీవనము పై తగ – దేవుఁడును దా
నొక్కఁడు చిర-జీవియగు ప్రభు పాపి జీవులఁ – గావఁ దనుఁ జావునకు నొడాఁబడి llఉదయించిll
2.    యూదుల నడుమన్ – బెక్కగు భేదా – భేదముల్ బొడమన్ = వాదించి
ప్రభు రాకఁ – గాదంచు మది నెంచి = మిదుఁ జూడని వారి కారుండ
వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డె దయాళుఁడు ప్రాణ మిడుటకు  llఉదయించిll
పాట – 41
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
 మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను -2
1.     ఘోరాంధకారమున దీపంబులేక- పలుమారు పడుచుండగా
 దుఃఖ నిరాశ యాత్రికులంతా - దారితప్పియుండగా
 మార్గదర్శియై నడిపించువారిన్ - ప్రభుపాద సన్నిధికి
 దివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు - ఉదయించె ఈ ధరలో ||ఉద||
2.    చింతవిచారముతో నిండియున్న - లోకరోదనవిని
 పాపంబునుండి నశించిపోగా - ఆత్మ విమోచకుడు
 మానవాళికై మరణంబునొంది - నిత్య జీవము నివ్వన్
దివ్య రక్షకుడు ప్రకాశతార - ఉదయించె రక్షింపను ||ఉద
3.    పరలోక తండ్రి కరుణించి మనల - పంపెను క్రీస్తుప్రభున్
 లోకాంధులకు దృష్టి నివ్వ - అరుదెంచె క్రీస్తు ప్రభువు
 చీకటి నుండి దైవ వెలుగునకు - తెచ్చె క్రీస్తు ప్రభువు
 సాతాను శృంఖలములను తెంప - ఉదయించె రక్షకుడు ||ఉద||
పాట – 42
ఉదయించెను నాకోసం - సదయుడైన నిజదైవం
పులికించెను నా హృదాయం - తలపోయగ యేసుని జన్మం
అ.ప. : సంతోషం పొంగింది - సంతోషం పొంగింది - సంతోషం పొంగి పొర్లింది
1.     కలుషమెల్లను బాపను - సిలువప్రేమను చూపను
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
2.    భీతిని తొలగించను - నీతిని స్థాపించను
దోష శిక్షను మోయను - త్రోవ సిద్ధాము చేయను.
పాట – 43
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
1.     ఊరావల పొలాల్లోన-గొర్రెమందలను దోలి
నిండ గొంగళ్ళు కప్పి-ముళ్ళ కర్ర చేత పట్టి
గొల్లోలంతా చేరి-యేసయ్యను గొలుస్తుంటే ..ఊర
2.    నజరేన్ బృందమంతా-ఊరూర బయలెల్లి
యేసు పుట్టిన వార్త-ఊరంతా సెబుతుంటే
వంకాని సందురూడు-చిన్నబోయి సూతుంటే ..ఊర
3.    సిమ్మా సీకట్లు కమ్మి-జాము రాత్రి గావచ్చె
వైజాగ్  వాసులంతా-యేసు మాట వినవచ్చె
ముచ్చట్లు అన్ని వింటూ-ముచ్చటగా సూతుంటే ..ఊర
4.    క్రిస్మస్ సంబరాలు-ఇంటింట చూస్తుంటే
వంటిట్లో వెరైటీలు-మాముందు కొస్తుంటే
మీ ఇంటిని యేసు బాబు-సల్లగా సూడాలంటే

పాట – 44
ఎంత దీనాతి దీనమొ  యేసయ్యా - నీ జననమెంతో దయనీయమో
తలుచుకుంటే నా గుండే తడబడి కరిగి కరిగి నీరగుచున్నది.
1.     ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా
ఆ సత్రములో ఓ యేసయ్య నీకు స్ధలమే దొరకలేదయ్య (ఎంత)
2.    నిండు చూలాలు  మరియమ్మ తల్లి నడవలేక సేడివడి పోయెనయ్యా
దిక్కుతోచక ఓ యేసయ్య పశువు పాకలొ ప్రసవించెనయ్యా (ఎంత)
3.    చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టేనయ్యా
పసికందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్య (ఎంత)


పాట – 45
ఎంత దూరమెంత దూరమో - ఆ బాలయేసు బసను చేర
ఎంత దూరమెంత దూరమో - ఆ స్వామి మాకు దర్శనమీయ
1)    దేవుళ్ళకు దేవుడంట - నిక్కమైన దేవుడంట
రాజులకు రారాజంట - సక్కనైన మారాజంట
నమ్మినోళ్ళందరిని - గమ్మున రక్షించునంట (2)(ఎంత)
2)   పెద్ద పెద్ద లోగిళ్ళలో - పెత్తనాల సావిళ్లలో
విత్తబోయి సూత్తుండగా - ఇంకా సానా రేత్రుండగా
బేత్లేములో పుట్టెనట - పశుల పాకలోనట(2)(ఎంత)

పాట – 46
ఎంతో శుభకరం ప్రభు జననం
చీకటి బ్రతుకుల అరుణోదయం
అ.ప: విడుదల దొరికెను – శ్రమలిక వెడలెను సంతోషము విరిసెను
1)    పరిశుద్దముగా తనపిల్లలుగాఇలలో జీవింపను 
మనకై నీతిరాజు మనిషై  వెలిసాడు
తన వైభవమును విడిచి దిగినాడు
2)   జీవితకాలము లేకుండా భయము  దేవుని సేవింపను 
సర్వాధికారి తండ్రి కుమారుడయ్యాడు
రక్షణ శృంగమై  భువిలో  పుట్టాడు.


పాట – 47
ఏం వింతరో ఇదేం కాంతిరో - జనులందరికీ మహా సంబరమంటరో
ఆ ఎలుగు సూడలేక కళ్ళు సెదిరిపోయే
సంతోషం పట్టలేక మనసు మూగబాయె
1.     పశువుల తొట్టిలో పొత్తిగుడ్డల చుట్టలో
మన సింతలు దీర్చోడు మన బాధలు బాపోడు
దావీదు పురములో రక్షకుడు ఎలిసె
ఆలస్యమేల ఇక ఆనవాలు తెలిసె
2.    రెక్కలు విప్పుకొని సక్కసక్కని దూతలు
సమాధానమంటూ పాడుతుండ్రు పాటలు
పామరులం మనకే ముందుగా తెలిసె
గొప్పోళ్ళ సిగ్గుదీయ మనకు దారి తెరిచె
3.    మెస్సీయ వస్తని ఎదురుచూస్తే ఇంతదాక
వచ్చిండదిగో సూడు మురుస్తుంది పసులపాక
వినవచ్చుచున్నది సక్కగాను శిశువు కేక
సాటుదాం అందరికీ రక్షకుడు యేసురాక
పాట– 48
ఏడానుంటివిరా – ఓరన్న
వేగి ఉరికి రారా – ఓరన్న (2)
యాదికొచ్చెరా యాదన్న
యేసు సిత్ర కథ వినరన్న (2)
ఏలియాలో ఏలియాలో ఏలియాలో
యేసే నా రక్షకుడు ఏలియాలో
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా (2)
యూదా దేశమందు – ఓరన్న
బెత్లెహేమునందు – ఓరన్న
పశువుల శాలయందు – ఓరన్న
ప్రభు యేసు జన్మించె – ఓరన్న
చుక్కల రెక్కలు ఎగుర వేయుచు
చల్లని దూతలు పాట పాడిరి (2)
చల్ల చల్లని చలిలోన – ఓరన్న
గొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2)        ||ఏలియాలో||
పెద్ద పెద్దని వాడై – యేసన్న
ఇంత ఇంతింత ఎదిగె – యేసన్న
వింత వింతలు చేసె – యేసన్న
ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదు వేల మందికి పంచెను (2)
తుఫాను నణిచెను – యేసన్న
సంద్రాన నడిచెను – యేసన్న (2)        ||ఏలియాలో||
ఏ పాపమెరుగని – ఓరన్న
యేసయ్య తండ్రిని – ఓరన్న
సిలువ వేయమని – ఓరన్న
కేకలు వేసిరి – ఓరన్న
సిలువ మోసెను శ్రమల నోర్చెను
మూడవ నాడు తిరిగి లేచెను (2)
పరలోకమెళ్లాడు – యేసన్న
త్వరలోనే వస్తాడు – యేసన్న (2)        ||ఏలియాలో||
పాట – 49
 ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని
 ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని గుండెల ధుఖం నిండిపోగ  గుండె గొంతుక పెనుగులాఢగ  (ఏపాట)
1.     కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై  (2)
సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియై
పాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట  (2)  (ఏపాట)
2.    పసువులపాకె పాపిస్టిలోకమై గొంగలి దుప్పటి పాపపుముసుగై (2)
 పసువులతొట్టె మోసమైనామనసై ఫొత్తిబట్టలె మరణపాసములై
పాడేనఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2) )  (ఏపాట)
పాట – 50
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా
జనులందరికీ పరమ సంతసం కలిగించే రక్షకుడు పుట్టాడని
1.     చూపులో విరిసె వెన్నెల చల్లదనం
మాటలో కురిసె కమ్మని కరుణరసం
శతకోటి దీపాల కాంతులు వెదజల్లే
సుత యేసుక్రీస్తు ప్టుటడని
2.    రాజ్యాలనేలే రారాజు ఆ ప్రభుడు
పూజింపదాగిన బలవంతుడగు విభుడు
పాపాలనే బాపి నిత్యము తోడుండే
కాపరిగా ఇలపుట్టాడని
పాట – 51
ఒరేయ్ చిన్నోడు – వత్తున్న వత్తున్న – ఒరేయ్ పెద్దోడా – ఆ.... ఎంటిన్న 
రచ్చకుడు మనకోసం పుట్టడాంటరా- తొందరగా  రండి – బెత్తెముదాకా వెళ్ళి
ఒరేయ్ చిన్ననా – ఒరేయ్ పెద్ధన్నా
ఒరేయ్ జానన్నా – ఒరేయ్ జోనా అన్నా(2సా)
పోధము రండిరా బెత్తెముకు – రక్షకుడు పుట్టే మనకు
1.       దావీదు పురామందు – రక్షకుడు పుట్టాడు
దేవుని దూతలు – మనకు తెలియజేశారు – (2)
సంతోషమే – హాయ్ - సంతోషమే – హాయ్
సంతోషమే – మనకు సమాధానమే – హాయ్ (2)
2.      పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడు
యేసు క్రీస్తని చెప్పారు దూతలు (2)
3.      పశువులు తొట్టిలో – పరుండిన పసివాడు
పాపము తొలగింప – పరము నుండి దిగినాడు (2)
పాట– 52
ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు – ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
సర్వేశ్వరుండు – నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
ఓ దూతలారా – ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ ఈ వేల స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య – మాయే నర రూప
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో

పాట – 53
కాలము సంపూర్ణమాయెను
దేవుడే కుమారునిగ భువిలో జన్మించెను
క్రిస్మస్ హ్యాపి క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
క్రిస్మస్ హ్యాపి కిస్మస్ క్రీస్తు ఆరాధన
1.     ఆది వాక్యము ఆయె నరరూపుగ
ఆది సంకల్పము ఇలలో నెర వేరేగా       " క్రిస్మస్ "
2.    ఆది సంభూతుడు కృప సత్య సంపూర్ణునిగా
కన్య గర్బములో క్రీస్తుగా పుట్టెను      "  క్రిస్మస్  "

పాట – 54
కృపయు సత్యము కలిసి వెలసెను
క్రీస్తురాజుగా మహిమ రూపము మనిషి ఆయెను
బాలయేసునిగా హల్లెలూయ
1.     ప్రవచనం పరిపూర్ణమై - కాలము సంపూర్ణమై
సకల ప్రజలకు రక్షణై - సంతస వార్తయై
2.    గ్రుడ్డివారికి దృష్టియై - బాధితులకు విమోచనై
బీదలకు సువార్తయై - రక్షణ మార్గమై
3.    నిత్యుడైన తండ్రియై - సత్యమున కాధారుడై
శాంతికే నిలయమై – నిత్యజీవమై

పాట – 55
కొండమీద సుక్కబోడిసె – గుండెలోన దీపమెలిగె 
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ … 
తూర్పువైపు వెలుగు రేఖ 
నిలువు పొడుగు పెరుగుతుంటె – నిలువలేక పోతున్నా మందకాడ 
అబ్బో … దూత మాట వచ్చిందిరో – వర్తమాన మిచ్చిందిరా,
దావీదు పురమంటరో – అల్ల దేవరాజు కోలువంటరా //2//
1. దీపమెల్ల దారి తను చూపుతుంటే – ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే 
గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే – ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే 
అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల – 
అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల//కొండ .

పాట – 56

కొండలలో కోనలలో
బేతలేము గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో (2)         ||కొండలలో||
కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో (2)
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర (2)
దూతా గానము
శ్రావ్యా రాగము (2)
పరమ గీతము         ||కొండలలో||

దావీదు పురమందున
పశువుల శాలయందున (2)
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు (2)
రండి వేగమే
రండి శీఘ్రమే (2)
తరలి వేగమే          ||కొండలలో||